బడ్జెట్ లో నిధులు తెచ్చుకోలేకపోవడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యం: పవన్ కల్యాణ్

  • కేంద్ర బడ్జెట్ పై స్పందించిన పవన్
  • బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉందని వ్యాఖ్యలు
  • ఇప్పటికైనా వైసీపీ సర్కారు కళ్లుతెరవాలని హితవు
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందన్న ఆయన, వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. వీళ్లు కూల్చివేతలు, రద్దులు, రాజధాని తరలింపులు, ప్రత్యర్థులను బూతులు తిట్టడంలో చూపించినంత శ్రద్ధ బడ్జెట్ లో నిధుల సాధన కోసం పెట్టి ఉంటే కేంద్రం నుంచి భారీగా నిధులు వచ్చేవని పవన్ అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేకపోవడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనని, ఇప్పటికైనా వైసీపీ సర్కారు కళ్లు తెరవాలని హితవు పలికారు.
Go Back to Shorts
Union Budget 2020
Pawan Kalyan
Janasena
YSRCP
Andhra Pradesh

More Telugu News